Characteristics che guevara biography in telugu pdf

చే గువేరా ఒక మెడికల్ స్కూల్ లో చదివే సమయంలో చేసిన కొన్ని ప్రయాణాలు తన జీవితాన్ని చాలా ప్రభావితం చేసాయి. ఈ ప్రయాణంలో ప్రజల పై జరిగే అరాచకాలను మరియు దౌర్జన్యాలను చూసి విప్లవం మొదలు పెట్టాలని అనుకున్నారు.

చే గువేరా కు ఆస్థమా సమస్య ఉన్నా కూడా వివిధ ఆటలలో నైపుణ్యం సాధించారు. మొదటి సారిగా  తాను చేసే విప్లవం ద్వారా క్యూబా ప్రజల జీవితాలను మరియు వారి సమస్యలను పరిష్కరించాలని అనుకున్నారు. 

అక్కడి ప్రభుత్వం తో జరిగిన పలు యుద్దాలు చేసిన తరవాత క్యూబాను గెలుచుకున్నారు.

క్యూబాలో కొన్ని విబేధాలు రావటం వల్ల బొలివియా వెళ్లిన చే గువేరాకు చేదు అనుభవం కలిగింది.

అక్కడి ప్రజలు సహకరించట పోవటం వల్ల చివరకి అక్కడి ప్రభుత్వం చే గువేరాను కాల్చి చంపింది.    

బాల్యం :

ఎర్నెస్టో గువేరా (Ernesto Guevara) ఎర్నెస్టో గువేరా లించ్ (Ernesto Guevara Lynch) మరియు సెలియా డి లా సెర్నా వై లోసా (Celia de component Serna y Llosa) అనే దంపతులకు 14 జూన్, 1928 సంవత్సరంలో ఆర్జెంటినా లోని రోసారియో అనే పట్టణంలో  జన్మించారు. 

ఈ దంపతులకు పుట్టిన 5 పిల్లలలోచే గువేరా నే అందరికంటే పెద్ద కొడుకు.చే గువేరా కు చిన్నపాటి నుంచే ఆస్థమా (ఉబ్బసం) సమస్య తో బాధపడేవారు కానీ ఈ సమస్య తన జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించటంలో ఎప్పుడూ కూడా అడ్డు పడలేదు.  

చే గువేరా ఒక మంచి రగ్బీ ఆటగాడు, ఇదే కాకుండా షూటింగ్ చేయటం, స్విమ్మింగ్ చేయటం, గోల్ఫ్, ఫుట్ బాల్ మరియు చెస్ కూడా ఆడేవారు.    

ఆటలతో పాటు చే గువేరా పుస్తకాల పురుగు అని కూడా చెప్పవచ్చు,చే గువేరా ప్రసిధ్ధి చెందిన వ్యక్తుల యొక్క పుస్తకాలను చదివే వారు.

చే గువేరా కి చిన్నప్పటి నుంచే పేద ప్రజల వైపు మక్కువ చూపేవారు. 

చే గువేరా చేసిన యాత్రలు : 

1950 సంవత్సరంలో  మెడికల్ కాలేజీ లో చదివే సమయంలో చే గువేరామొదటి యాత్రను చేయటం జరిగింది. ఈ యాత్ర ను తన సైకిల్ సహాయంతో ఆర్జెంటినా లోని రూరల్ ప్రాంతాలలో దాదాపు 4500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసారు. 

తన రెండవ ప్రయాణాన్ని 1951 వ సంవత్సరంలో దక్షిణ అమెరికా కి చేసారు.

ఈ ప్రయాణం తన మోటర్ సైకిల్ పై 9 నెలల పాటు చేసారు. ఈ ప్రయాణ సమయంలో చిలీ (Chile) దేశం లోని  ప్రజలు పడే కష్టాలను,పేదరికాన్ని మరియు అక్కడ జరిగే అన్యాయాలను చూసి చాలా కదిలిపోయారు.  

తన యాత్రలను పూర్తిచేసుకున్న తర్వాత 1953 సంవత్సరంలో తన చదువును పూర్తి చేసుకొని మెడికల్ డిగ్రీ పట్టా పొంది డాక్టర్ ఎర్నెస్టో గువేరా అయ్యారు.  

1953 వ సంవత్సరంలో గ్వాటెమాల (Guatemala) దేశంలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అక్కడ విప్లవాన్ని మొదలుపెట్టాలని అనుకున్నారు.

ముందు అక్కడి ప్రభుత్వం తో కలిసి పనిచేయాలని అనుకున్నారు, కానీ అమెరికా జోక్యం  వల్ల ప్రభుత్వం లో చాలా మార్పులు వచ్చాయి. 

గ్వాటెమాల దేశంలో జరిగిన పరిణామాల తరవాత విప్లవానికి ఆయుధ బలం కూడా తప్పనిసరి అనే విషయం చే గువేరా కి అర్థం అయ్యింది.  

క్యూబా విప్లవం : 

1954 వ సంవత్సరంలో మెక్సికో దేశంలో జనరల్ హాస్పిటల్ లో తన వైద్య వృత్తిని కొనసాగించారు.

మెక్సికో లో ఉంటున్నప్పుడు గ్వాటెమాల (Guatemala) నుంచి వచ్చి ఉంటున్న కొంత మంది ప్రముఖులతో మరియు విప్లవ కారులతో చె గువేరా పరిచయం ఏర్పడుతుంది.

ఈ క్రమం లో 26th అఫ్ జులై ఉద్యమాన్ని స్థాపించిన ఫిడేల్ కాస్ట్రో (Fidel Castro) తో కూడా కలవటం జరుగుతుంది. ఈ ఉద్యమం క్యూబా కు చెందిన విప్లవ కారులకు చెందినది.  

ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏమిటంటే, క్యూబా లో ఫుల్జెన్సియో బాటిస్టా (Fulgencio Batista) ద్వారా జరుగుతున్న నియంత పాలనను అంతమొందించటం.

చే గువేరా క్యూబా లో ఉన్న పరిస్తుతులను మరియు 26th confiscate July Movement యొక్క ఉద్దేశం ను గ్రహించిన తరవాత ఇలాంటి విప్లవం గురించే ఇన్ని రోజులు నుంచి ఎదురుచూస్తున్నాని అనుకున్న చె గువేరా  విప్లవం బాటలో నడవటం ప్రారంభిస్తారు.  

గువేరా తాను ఒక డాక్టర్ కావటం వల్ల విప్లవ కారులకు వైద్య సంభందిత సహాయం అందచేయాలనుకుంటారు కానీ మిలిటరీ ట్రైనింగ్ లో కూడా పాల్గొంటారు.

 ఈ ట్రైనింగ్ లో గొరిల్లా యుద్ధ వ్యూహాలను నేర్చుకున్నారు, నదుల గుండా వెళ్ళటం, కొండలు ఎక్కటం, పొదల గుండా వెళ్ళటం, ఆకస్మిక దాడులను చేయటం లాంటి వాటిపై గంటల తరబడి ట్రైనింగ్ చేసేవారు.

ఈ ట్రైనింగ్ లో చె గువేరా మంచి పేరును కూడా సంపాదించారు.  

మొదటి దాడి :  

 ఫిడేల్ కాస్ట్రో నాయకత్వంలో నవంబర్ 25 1956 వ సంవత్సరంలో 82 మంది బృందం తో క్యూబా పై దాడి చేయటానికి బయలుదేరుతారు.

  • Josephine paterson and loretta zderad autobiography books
  • క్యూబా కి చేరుకున్న వెంటనే అక్కడి నుచి ఎదురు దాడి జరుగుతుంది, ఫలితంగా 60 మంది చనిపోయి కేవలం 22 మంది మిగులుతారు.   

    ఈ బృందంలో వైద్యుడిగా ఉన్న చె గువేరా మొదటి సారి తన మెడికల్ కిట్ ను పక్కన పెట్టి ఆయుధాలను తీసుకోవటం జరుగుతుంది. 

    ఈ ఆకస్మిక దాడి తరవాత మిగిలిన కొద్దీ బృందం పర్వతాలలో వెళ్లి తల దాచుకున్నారు. ప్రపంచం ఇక ఈ ఉద్యమం నశించి పోయింది అనుకునే సమయానికి 1957 వ సంవత్సరంలో  ఈ ఉద్యమ నాయకుడు ఫిడేల్ కాస్ట్రో మీడియా కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరుగుతుంది. 

    పర్వతాలపై ఉన్నప్పుడు దోమల కాటు వల్ల చె గువేరా శరీరం పై దద్దుళ్ళు వచ్చేవి.

    తన విప్లవ జీవితంలో ఇవి మరవలేని రోజులు అని చె గువేరా పేర్కొన్నారు.

    పర్వతాలలో తల దాచుకుంటున్న సమయంలో అక్కడ నివసిస్తున్న ప్రజల జీవితాలు స్కూల్ లు, కరెంటు, వైద్య సదుపాయాలు లేకుండా దయనీయంగా ఉన్న విషయాన్నీ గ్రహించారు. వీరి కోసం ఏదైనా చేయాలనే చె గువేరా తపన చిన్న చిన్న హాస్పిటల్స్ ను, స్కూల్ లను, తినటానికి బ్రెడ్ ఒవేన్ లను తయారు చేసారు.

    ఇవే కాకుండా గ్రనేడ్ తయారు చేసే ఫ్యాక్టరీ, మిలిటరీ కి సంబంధించిన వ్యూహాలను నేర్పించడానికి బృందాలను ఏర్పాటు చేసారు.

    సమాచారాన్ని చేరవేయడానికి ఒక న్యూస్ పేపర్ కూడా ఉపయోగించేవారు.

    చె గువేరా కమాండర్ గా : 

    చె గువేరా యొక్క తెలివి తేటలను చుసిన తరవాత ఫిడేల్ కాస్ట్రో ఆర్మీ యొక్క కమాండర్ గా నియమించారు.  

    చె గువేరా కమాండర్ గా మారిన తరవాత ఉద్యమాన్ని వదిలివేసిన వారిని మరియు గూడాచారులను చంపి వేసేవారు.   

    తన బృందం లో ఉన్న సభ్యులకు ఖాళీ సమయాలలో కొంత స్వేచ్ఛను ఇచ్చేవారు, చదువు రాని వారికీ చదువు వచ్చే వారు పాఠాలు చెప్పేవారు.   

    1958 వ సంవత్సరంలో గువేరా  తమ ఉద్యమం తరపు నుంచి  వార్తల కోసం ఒక రేడియో స్టేషన్ ను కూడా ప్రారంభించారు.

    ఉద్యమం సభ్యులు మాట్లాడుకోవడానికి రేడియో టెలిఫోన్ కూడా ఇచ్చారు.    

    మరోవైపు క్యూబా ప్రభుత్వం తిరుగుబాటుదారులను పట్టుకున్న వెంటనే జైళ్లలో చంపటం మొదలుపెట్టారు. ప్రభుత్వం చేస్తున్న క్రూరమైన దౌర్జన్యాలను చుసిన అమెరికా ప్రభుత్వం వీరికి ఆయుధాల సరఫరా నిలిపి వేయాలని నిర్ణయించుకున్నారు.    

    జులై 8,1958 వ సంవత్సరంలో క్యూబా ప్రభుత్వం లాస్ మెర్సిడెస్ యుద్ధం ద్వారా క్యూబా విప్లవాన్ని అణిచివేయాలని అనుకున్నారు.   

    గువేరా ఈ యుద్దాన్ని తనదైన శైలి ద్వారా చేసి యుద్దాన్ని ఓడిపోకుండా కాపాడుకున్నారు.

    కాస్ట్రో ఈ యుద్దాన్ని సీజ్ ఫైర్ చేయాలని కోరగా క్యూబా ప్రభుత్వం కాల్పులు అపి వేసింది. అదను చూసిన కాస్ట్రో మరియు చే గువేరా ఆర్మీ కొండలపైకి వెళ్లి దాక్కున్నారు.  

    1958 సంవత్సరం చివరిలో చే గువేరా ఆర్మీ క్యూబా యొక్క రాజధాని వైపు దాడి చేయటం మొదలుపెట్టారు.  కొన్ని రోజుల లోనే చే గువేరా యొక్క ఆర్మీ క్యూబా యొక్క రాజధాని ను సొంతం చేసుకుంది.

    ఈ విషయం గ్రహించిన బటిస్టా పెద్ద మొత్తంలో డబ్బుతో దేశం వదిలి పారిపోయాడు.    

    చే గువేరా ఆర్మీ క్యూబా ప్రభుత్వానికి చెందిన చాలా మందిని బందీలుగా చేసి మరణ శిక్ష కూడా విధించింది.  

    గువేరా అధికారంలోకి వచ్చిన తరవాత క్యూబా లో చాలా మార్పులు జరిగాయి. చదువు, వైద్య సదుపాయాలు, పక్కా గృహాలు మరియు ఉద్యోగాల పట్ల ఎక్కువ దృష్టిని సారించారు.     

    చే గువేరా ఇతర దేశాలలో విప్లవకారుడిగా :

    కాస్ట్రో మరియు చే గువేరా మధ్య విబేధాలు రావటం వల్ల క్యూబా వదిలి ఇతర దేశాలకి వెళుతున్నాని చే గువేరా ఒక ఉత్తరం రాసి క్యూబా వదిలి వెళ్లిపోయారు.   

    క్యూబా నుంచి ఆఫ్రికా దేశమైన కాంగో (Congo) కి వెళ్ళటం జరిగింది.

    అక్కడ ఇంతకు ముందు నుంచి పోరాడుతున్న నాయకులతో చేయి కలపటం జరిగింది. 

    చే గువేరా అనుకున్న విధంగా కాంగో తిరుగుబాటుదారులు పోరాడక పోవటంతో చే గువేరా నిరాశ చెందారు. కాంగో ప్రజలకి పోరాడే ఉద్దేశం లేదు అని చెప్పి చే గువేరా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    మరణం : 

    కాంగో తరవాత క్యూబాకు వచ్చిన చే గువేరా 1996 సంవత్సరంలో  బొలివియా కి వెళ్లి అక్కడ విప్లవం మొదలుపెట్టాలి అని అనుకున్నారు.

    కానీ అక్కడ ఉన్న లోకల్ పార్టీలు మరియు అక్కడి ప్రజల సహకారం కూడా చే గువేరా కు అందలేదు. 

    బొలివియా ప్రభుత్వం మరియు అమెరికా కు చెందిన CIA చే గువేరా స్థావరాలపై దాడి చేయటానికి ప్రణాళికలు వేయటం మొదలుపెట్టారు. 

    అక్టోబర్ 8, 1967 సంవత్సరంలో చేగువేరా ఉన్న స్థావరాలపై ఆకస్మిక దాడి చేసినప్పుడు గువేరా లొంగిపోయారు.

  • Biography albert
  • ఆ మరుసటి రోజు అక్కడి ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు చేగువేరా ను కాల్చి చంపారు.          

    Categories HistoryTags che guevara history, che guvera cuba